News October 8, 2025
కర్నూల్ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన వైఎస్ జగన్

వైసీపీ టాక్స్-కర్నూల్ యూట్యూబ్ ఛానల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బటన్ నొక్కారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News October 8, 2025
అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లాలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్, గర్ల్ చైల్డ్ డే, చెత్త సేకరణ, తల్లికి వందనం, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
News October 8, 2025
HYD: వాటర్ ట్యాంకర్లు ‘మాయం’.. చేయలేరిక

నీటి ట్యాంకర్ల దారి మళ్లింపులు, అక్రమ బిల్లింగ్‌లపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు HMWSSB ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం (AVTS) తీసుకొచ్చింది. యాప్‌లో లైవ్ ట్రాకింగ్‌తో ట్యాంకర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ట్రిప్, బిల్లు డిజిటల్‌గా రికార్డ్ అవ్వడంతో అక్రమాలకు తావుండదు. వాహనం ఆలస్యమైనా అధికారులకు అలర్ట్‌లు వెళ్తాయి. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన సేవలు అందుతాయి.
News October 8, 2025
హైకోర్టు నుంచి సీఎం ఇంటికి మంత్రులు, ఏజీ

TG: BC రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేలకపోవడంతో CM రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి AG, లాయర్లు, మంత్రులను తన నివాసానికి రావాలని సూచించారు. రేపు కోర్టులో వాదనలు, ఎలాంటి తీర్పు ఉండబోతుందనే తదితర అంశాలను చర్చించనున్నారు. అటు విచారణ వాయిదా పడటంతో SEC నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కోర్టు ప్రాంగణంలోనే ఏజీతో మంత్రుల బృందం సమావేశమైంది.