News October 8, 2025
APPLY NOW: ఇస్రోలో 20 పోస్టులు

ఇస్రో 20 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/
Similar News
News March 31, 2026
ట్రంప్‌కు షాకిచ్చిన ఇటలీ!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇటలీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనే US విమానాలకు ఇటలీ ఎయిర్‌స్పేస్‌ను మూసేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అలాగే సిసిలీలో ఉన్న తమ వైమానిక స్థావరాన్ని వాడుకోవడానికీ అనుమతి నిరాకరించినట్లు తెలిపింది. యూఎస్ బాంబర్ విమానాలను నిలపడానికి అమెరికా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల స్పెయిన్ సైతం <<19516561>>ఇలాంటి ప్రకటనే<<>> చేసిన విషయం తెలిసిందే.
News March 31, 2026
GTvsPBKS.. టాస్ గెలిచిన పంజాబ్

IPL: చండీగఢ్ వేదికగా కాసేపట్లో GTతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన PBKS కెప్టెన్ శ్రేయస్ బౌలింగ్ ఎంచుకున్నారు.
PBKS: ప్రభ్‌సిమ్రాన్, కూపర్, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టోయినిస్, మార్కో, జేవియర్, విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, సుందర్, ఫిలిప్స్, షారుఖ్, తెవాటియా, రషీద్ ఖాన్, రబడ, అశోక్ శర్మ, సిరాజ్
News March 31, 2026
రంగుల ప్రపంచంలో ఇదో వింత.. పింక్ కలర్ భ్రమే!

కాంతిలో సప్తవర్ణాలు ఉంటాయని మనకు తెలుసు. ప్రతి రంగుకు ఒక ప్రత్యేక తరంగదైర్ఘ్యం (Wavelength) ఉంటుంది. కానీ పింక్ కలర్‌కు అటువంటిది ఉండదు. సప్తవర్ణాల చివరలో ఉండే ఎరుపు, ఊదా రంగులు కలిసినప్పుడు మన కళ్లు గందరగోళానికి గురవుతాయి. దాన్ని తొలగించడానికి మన మెదడు సృష్టించే రంగే ‘పింక్’. అంటే ప్రకృతిలో పింక్ అనేది లేదు, అది భ్రమ మాత్రమే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో (34/100)


