News October 8, 2025

MBUలో అక్రమ వసూళ్లు ఇలా..!

image

మోహన్ బాబు యూనివర్సిటీలో వివిధ రూపాల్లో నగదు <<17945897>>వసూళ్లు <<>>చేశారని తెలుస్తోంది. 2022-23లో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ.24,500, 23-24, 24-25లో రూ.37వేలు వసూళ్లు చేశారు. ఇలా 2022-23లో రూ.2.59 కోట్లు, 23-24లో రూ.10.65 కోట్లు, 24-25లో రూ.12.93 కోట్లు రాబట్టారు. CAMU సాప్ట్‌వేర్‌తో విద్యార్థుల అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. ఇందులోనూ తప్పుడు హాజరు చూపించి ఒక్కొక్కరి నుంచి రూ.7,500 వసూళ్లు చేశారట.

Similar News

News October 8, 2025

నల్గొండ: స్కిల్ కాంపిటీషన్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి

image

ప్రపంచ స్కిల్‌ కాంపిటీషన్‌లో (World Skill Competition) పాల్గొని, అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువత ఈ నెల 15లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 24 ఏళ్ల వయస్సు వారు, నైపుణ్యం కలిగిన నిరక్షరాస్యులు కూడా అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు http://www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 8, 2025

అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

జిల్లాలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్, గర్ల్ చైల్డ్ డే, చెత్త సేకరణ, తల్లికి వందనం, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

News October 8, 2025

HYD: వాటర్ ట్యాంకర్లు ‘మాయం’.. చేయలేరిక

image

నీటి ట్యాంకర్ల దారి మళ్లింపులు, అక్రమ బిల్లింగ్‌లపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు HMWSSB ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం (AVTS) తీసుకొచ్చింది. యాప్‌లో లైవ్ ట్రాకింగ్‌తో ట్యాంకర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ట్రిప్, బిల్లు డిజిటల్‌గా రికార్డ్ అవ్వడంతో అక్రమాలకు తావుండదు. వాహనం ఆలస్యమైనా అధికారులకు అలర్ట్‌లు వెళ్తాయి. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన సేవలు అందుతాయి.