News October 8, 2025

జగిత్యాల: తల్లిని వదిలేసిన కొడుకులపై చర్యలు

image

జగిత్యాల పట్టణానికి చెందిన కట్లోరి అనసూయ(70)ను కొడుకులు, కోడళ్లు నిర్లక్ష్యం చేయడంతో ఆమె ఆల్ ఇండియా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్‌ను ఆశ్రయించింది. ఆర్డీవో మధుసూదన్ వయోవృద్ధుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో అంతర్గామ్ గ్రామానికి చెందిన పోకల గంగమ్మ కేసులో కౌన్సిలింగ్ తర్వాత ఆమె కొడుకులు తల్లిని పోషించేందుకు సమ్మతి పత్రం అందజేశారు.

Similar News

News March 12, 2026

ఖమ్మం: తీరిన గ్యాస్ గండం.. భోజన కష్టాలు దూరం

image

యుద్ధ ప్రభావంతో గ్యాస్ ఏజెన్సీలు సరఫరా నిలిపివేయడంతో జిల్లాలోని హాస్టళ్లలో నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. సిలిండర్ల కొరతతో భోజన తయారీకి ఇబ్బందులు ఎదురవ్వగా.. అ.కలెక్టర్ శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించి, వసతి గృహాలకు నిరంతరాయంగా సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల భోజనానికి ఆటంకం తొలగిందని, ముందస్తు నిల్వలు పెంచుతున్నామని DBCDO జ్యోతి తెలిపారు.

News March 12, 2026

మహిళా జవాన్‌ను మోసం చేశాడు!

image

పామిడి(M) రామగిరికి చెందిన లోక్‌నాథ్‌ (అగ్నివీర్‌) బెంగాల్‌లో జవాన్‌గా ఉన్న మహిళను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇన్‌స్టాలో వీరి మధ్య పరిచయం ఏర్పడగా ఆమె భర్తతో కలహాలు, కుటుంబ విషయాలను పంచుకున్నారు. తాను అండగా ఉంటానని దగ్గరైన లోక్‌నాథ్‌ పెళ్లి చేసుకుంటానని అనంతపురం రప్పించి లాడ్జిలో లొంగదీసుకున్నాడు. తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై మోసం, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.

News March 12, 2026

పొదిలి: వామ్మో.. ఇలానూ మోసం చేస్తారా..?

image

పొదిలిలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదే సమయంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ‘మీకు లైసెన్స్ లేదు. తనిఖీలు చేయకుండా ఉండాలంటే రూ.60వేలు ఇవ్వండి’ అని కోరగా.. భయపడిన నిర్వాహకుడు రూ.6వేలు ఫోన్ పే చేశాడు. అసలు అధికారి తనిఖీలకు వెళ్లగా.. మీకు డబ్బులు పంపానని నిర్వాహకుడు చెప్పాడంతో ఆయన అవాక్కయ్యాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.