News October 8, 2025

అత్తిలిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం

image

అత్తిలిలోని ఎన్టీ రామారావు విగ్రహం ధ్వంసమైంది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు విగ్రహాన్ని ఆనుకుని ఉన్న ఫ్లెక్సీ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. తొలుత దుండగులు కూల్చివేశారనే అనుమానంతో టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించిన పోలీసులు ప్రమాదవశాత్తూ విగ్రహం ధ్వంసమైనట్లు నిర్ధారించారు.

Similar News

News October 8, 2025

ఆక్వా చెరువుల సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: కలెక్టర్

image

ఆక్వా చెరువులు సాగుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, వెంటనే అప్సడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల ఆక్వా చెరువులను అప్సడ కింద నమోదు చేసుకోవడం జరిగిందని, ఇంకా 83 వేల ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని తెలిపారు. అప్సడలో రిజిస్టర్ అయిన వారు మాత్రమే పవర్ సబ్సిడీ, తదితర ప్రభుత్వ రాయితీలను పొందగలరని కలెక్టర్ అన్నారు.

News October 8, 2025

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

2027 జూలైలో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంగళవారం పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు తన కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పరిసర గ్రామాల్లోని ఆలయాలు, ముఖ్యంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు అవసరమైన అంచనాలు త్వరగా తయారు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పుష్కరాల కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News October 8, 2025

బీచ్ సందర్శకుల రక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

పేరుపాలెం, కేపీపాలెం బీచ్ సందర్శకుల రక్షణకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బీచ్ సందర్శకుల రక్షణ ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని బీచ్‌ల సందర్శకులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోకుండా అవసరమైన ముందస్తు చర్యలను సంబంధిత కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లా ఎస్పీ నయీం ఉన్నారు.