News October 8, 2025

కాగజ్‌నగర్ డివిజన్‌లో చిరుతపులి సంచారం

image

కాగజ్‌నగర్ డివిజన్‌లోని సిర్పూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధి వేంపల్లి, ఇస్గాం అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల పలు పశువులపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవులకు వెళ్లే ప్రజలు ఒంటరిగా వెళ్లకూడదని, తప్పనిసరిగా గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. సీసీ కెమెరాలతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు.

Similar News

News March 12, 2026

కడపలో రైతులకు రైతులే మార్గదర్శకులు: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ రంగంలో వినూత్నంగా అమలు చేస్తున్న “ఛాంపియన్ రైతుల ఎంపిక విధానం” గురించి కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎంకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 361 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రతి గ్రామంలో ఎక్కువగా పండించే పంటలో నైపుణ్యం కలిగిన 361 మంది రైతులను ఆదర్శ రైతులుగా (ఛాంపియన్లు) గుర్తించినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగు విధానలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.

News March 12, 2026

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క: ఎమ్మెల్యే గూడెం

image

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో హరీశ్ రావుతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని గూడెం ఆరోపించారు. “ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క” అంటూ రాజకీయంగా దూకుడు పెంచబోతున్నట్లు సంకేతాలిచ్చారు.

News March 12, 2026

రోడ్లు-భవనాల శాఖ పురోగతిపై సీఎం సమీక్ష

image

తెలంగాణలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని CM రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా నియంత్రించడంతో పాటు సరకు రవాణా వాహనాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కోమటి రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.