News October 8, 2025
NLG: పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

పత్తి కొనుగోళ్లకు నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఇప్పటికే సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిన్నింగ్ వ్యాపారులు, CCI మధ్య నిబంధనలపై ఒప్పందం కుదరడంతో సంక్షోభం తొలగిపోయింది. జిల్లాలో ఈ సీజన్లో 5.64 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది.
Similar News
News October 9, 2025
NLG: ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో GNM (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) శిక్షణ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను అర్హతగల యువతీ, యువకులు ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా వైద్యాధికారులను లేదా dme.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చన్నారు.
News October 9, 2025
నల్గొండ: నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

నల్గొండ జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నల్గొండ, దేవరకొండ డివిజన్లలో గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. 18 జడ్పీటీసీ, 197 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేశారు. ప్రతీ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని పేర్కొన్నారు.
News October 9, 2025
NLG: నేటి నుంచే లతీఫ్ షా వలి ఉర్సు ఉత్సవాలు

నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధి చెందిన హజరత్ సయ్యద్ లతీఫ్ షా వలి ఉర్సు ఉత్సవాలు గురువారం నుంచి వైభవంగా మొదలవుతున్నాయి. 3 రోజుల పాటు అధికారికంగా జరిగే ఈ వేడుకలకు దర్గాను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. నేడు సాయంత్రం జరిగే గంధం ఊరేగింపులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు.