News October 8, 2025

వరంగల్ కలెక్టరేట్లో అతనే బాస్?

image

పలు శాఖల ఫైళ్లు ZP CEO ద్వారానే రావాలని ఏకంగా వరంగల్ కలెక్టర్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఈ ఆర్డర్ ఆధారంతో ఇతర శాఖల అధికారులపై CEO పెత్తనం చెలాయిస్తున్నారట. ఏకంగా మంత్రుల సిఫార్సు లేఖలు సైతం పక్కన పడేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లాలో అడిషనల్ కలెక్టర్లు ఉన్నా ZP CEOకు అదనపు బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలొస్తున్నాయి. తమకింద పనిచేయాల్సిన జెడ్పీ సిబ్బంది పెత్తనం ఏంటని రెవిన్యూ అధికారులు నిలదీస్తున్నారట.

Similar News

News March 20, 2026

వ్యాధులను ముందే పసిగట్టే డివైజ్‌లు

image

క్యాన్సర్ సహా అన్ని వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు నెక్ట్స్ జనరేషన్ ఫ్లెక్సిబుల్ సెమీ కండక్టర్ డివైజ్‌లను IIT జోధ్‌పుర్ సైంటిస్టులు అభివృద్ధి చేస్తున్నారు. ఇవి శరీరం నుంచి వెలువడే బయో కెమికల్స్, కండరాల కదలిక, బాడీ టెంపరేచర్, హార్ట్ రేట్‌ను నిత్యం పర్యవేక్షిస్తాయి. ఏవైనా తేడాలు గుర్తించగానే సిగ్నల్ ఇస్తాయి. వీటిని యూనిఫామ్స్ లేదా ప్రత్యేక ప్యాచ్‌లలో ఎక్కువసేపు ధరించినా ఇబ్బంది ఉండదు.

News March 20, 2026

అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు ఏప్రిల్ 1 వరకు 12,424 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన వారు ఆర్‌ఎస్‌కే కేంద్రాల ద్వారా యూరియా పొందాలని సూచించారు. 45 కిలోల బస్తా ధర రూ.266.50గా నిర్ణయించగా, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 20, 2026

యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్

image

ప్రతి శాఖ తమ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రగతి ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లాను అభివృద్ధిలో ముందంజలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయాలన్నారు.