News October 8, 2025
సత్యం VS సుంకే.. చొప్పదండిలో ‘WILD పాలిటిక్స్’..!

హత్యా బెదిరింపులు, సూసైడ్ అటెంప్టులు, PSలో కేసులు వెరసి చొప్పదండి MLA, మాజీ MLAల మధ్య పాలిటిక్స్ వైల్డ్‌గా మారాయి. MLA సత్యంను దూషిస్తే హత్య చేస్తామంటూ మాజీ MLA రవిశంకర్‌కు బెదిరింపు CALLS రావడంతో PSలో ఫిర్యాదయ్యారు. MLAనే కేసు పెట్టించి పోలీసులతో కొట్టించడంతోనే హిమ్మత్ నగర్‌వాసి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేశాడని సుంకే ఆరోపించారు. MLA, మాజీ MLA మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్లు పరిస్థితులున్నాయి.
Similar News
News October 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 8, 2025
మత్స్య సంపద యోజన పథకానికి దరఖాస్తులు: కలెక్టర్

పీఎం మత్స్య సంపద యోజన పథకానికి విరివిగా దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్లో పీఎంఎంఎస్‌వై పథకం అమలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పీఎం మత్స్య సంపద యోజన పథకం ద్వారా వివిధ సబ్సిడీ రుణాలను పొంది లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. 50% బ్యాంకు రుణం, 40% సబ్సిడీ, 10% లబ్ధిదారుడు వాటాగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News October 8, 2025
చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>