News October 8, 2025
నైట్‌షిఫ్టులతో సంతానోత్పత్తిపై ప్రభావం

ప్రస్తుతకాలంలో ఉద్యోగంలో భాగంగా నైట్‌షిఫ్టుల్లో పనిచేయడం సాధారణం అయిపోయింది. దీనివల్ల మహిళల్లో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. ఇలా పనిచేయడం వల్ల శరీరంలోని సహజ జీవగడియారం దెబ్బతింటుంది. దీంతో హార్మోన్లు అసమతుల్యమై గర్భధారణ, సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతో పాటు పోషకాహారం, నిద్ర తగినంత ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
Similar News
News March 24, 2026
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపారు. అటు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడుతుందని పేర్కొన్నారు. మిగతా ఏరియాల్లో పొడి వాతావరణం ఉంటుందని వివరించారు.
News March 24, 2026
సర్వర్ డౌన్.. ఆగిన రిజిస్ట్రేషన్లు

తెలంగాణలో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్తంభించిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన సర్వర్ డౌన్ అవ్వడంతో ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు అన్నీ నిలిచిపోయాయి. ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్న వారు మళ్లీ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సర్వర్ వస్తుందన్న ఆశతో వినియోగదారులు ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో వేచి ఉన్నారు.
News March 24, 2026
72 గంటల ముందుగా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ రిఫండ్

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల్లో రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై 72 గంటల ముందుగా టికెట్‌ను రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం(నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ కట్ అవుతుంది) తిరిగి ఇవ్వనుంది. 72 నుంచి 24 గంటల్లోపు అయితే 25 శాతం, 24 గంటల నుంచి 8 గంటల్లోపు అయితే 50 శాతం కట్ చేయనుంది. 8 గంటల్లోపు అయితే ఎలాంటి రిఫండ్ ఉండదు. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో ఈ రూల్స్‌ను అమల్లోకి తేనుంది.


