News October 8, 2025

పెద్దపల్లి: BONUS ఎప్పుడు..?

image

యాసంగి సీజన్‌కి సంబంధించి సాగుచేసిన సన్నధాన్యానికి రూ.500 బోనస్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సన్నధాన్యం సాగుచేయని పెద్దపల్లి రైతులు బోనస్ ఆశతో గత యాసంగిలో జిల్లాలో 73 వేల ఎకరాల్లో సన్నధాన్యం పండించారు. వానకాలం పంట కోతకు వచ్చినా యాసంగి బోనస్ రాకపోవడంతో ఇస్తారో.. ఇవ్వరో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News October 8, 2025

ప్రజల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రాబోయే మూడు గంటల్లో ఏలూరు జిల్లాలో 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలకు, పొలాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

News October 8, 2025

ఎన్టీఆర్: ఎమ్మెల్యే అన్నదమ్ములదే సెటిల్మెంట్ల హవా..?

image

జిల్లాలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే, అతని సోదరులు సెటిల్మెంట్లు, గంజాయి టూ ఇసుక దందాలు, కమీషన్లు, వాళ్ళు చెప్పిందే రియల్ ఎస్టేట్ ధర అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వచ్చే రూ.కోట్ల ఆదాయాన్ని సోదరులు పంచుకోవడంతో పాటు ఇవి బయటకు రాకుండా ఉండేలా సొంత, ప్రత్యర్థి పార్టీ నేతలకు మామూళ్లు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది. ప్రతీ స్టేషన్ పంచాయితీ కూడా వీరి కనుసన్నల్లోనే జరుగుతుందట.

News October 8, 2025

38 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి: ASF కలెక్టర్

image

జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ కోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీసీఐ, మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ, జిన్నింగ్ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈ సంవత్సరం 3 లక్షల 34 ఎకరాలలో పత్తిపంట సాగు చేశారు. 38 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందన్నారు.