News October 8, 2025

PDPL: ‘నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే’

image

ZPTC, MPTC మొదటి విడత ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు, ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల డిపాజిట్ రసీదు, మూడు పాస్‌పోర్ట్ ఫొటోలు సమర్పించాలి. పార్టీ అభ్యర్థులైతే తప్పనిసరిగా Bఫామ్ జతచేయాలి. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల ధృవపత్రంపై గెజిటెడ్ సంతకం చేయించి అటాచ్ చేయాలి. ఎన్నికల వ్యయం నిర్వహణకు కొత్త బ్యాంకు ఖాతా ROకు సమర్పించాలి.

Similar News

News October 8, 2025

కాకరేపుతోన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు

image

ప్రస్తుత రాజకీయాలు ఉమ్మడి జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ములకలచెరువులో దొరికిన అక్రమ మద్యం, పరివట్టం వివాదం, దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన అంశాలు జిల్లాలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, విపక్షాల మాటలతో జిల్లాలో రాజకీయాలు కాకరేపాయి. చంద్రబాబు, పెద్దిరెడ్డి వంటి కీలకనేతలు ప్రాతినిధ్యం వహించడం, ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి.

News October 8, 2025

వసతి గృహ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో ప్రత్యేక అధికారులతో జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. మన్యం జిల్లా కురుపాంలో ఇటీవల వసతి గృహంలో బాలికలు అస్వస్థతకు గురైన విషయంపై చర్చించారు. పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు మంచి నీరు విద్యార్థులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 8, 2025

ఏలూరులో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అండర్-14, 17 బాలబాలికల జిల్లా స్థాయి క్రీడా పోటీల ఎంపికలు ఈనెల 10న జరుగుతాయని SGF సెక్రటరీ కె. అలివేలుమంగ తెలిపారు. బాస్కెట్‌బాల్ కొవ్వలిలో, వ్రేస్లింగ్ ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరుగుతాయన్నారు. పాల్గొనేవారు ఉదయం 9 గంటలకు ఎంట్రీ ఫారమ్, క్రీడా దుస్తులతో హాజరుకావాలన్నారు.