News October 8, 2025

నారద భక్తి సూత్రాలు – 4

image

‘యల్లబ్ధ్వా పుమాన్‌ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి’ నారద భక్తి సూత్రాల్లో ఇది నాలుగవది. దీనర్థం.. నిష్కల్మషమైన భక్తిని పొందిన మానవుడు సిద్ధుడు అవుతాడు. వారికి మృత్యు భయం ఉండదు. జీవితంలో మరేదీ అవసరం లేదన్నట్లు శాశ్వతమైన తృప్తిని పొందుతాడు. ఈ భక్తి లభించడం వల్ల సాధన పూర్తై, అన్ని కోరికలు తీరిన అనుభూతి కలుగుతుంది. అమరత్వం లభిస్తుంది. సమస్త సుఖాలకు మూలం, ముక్తికి మార్గం ఈ భక్తే. <<-se>>#NBS<<>>

Similar News

News October 8, 2025

నవోదయ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు

image

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో సీట్ల భర్తీకి అప్లికేషన్ గడువును మరోసారి పొడిగించారు. మొదట సెప్టెంబర్​ 23తో దరఖాస్తు గడువు ముగియగా దానిని అక్టోబర్​ 7 వరకు పెంచారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్టోబర్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని JNV అధికారులు తెలిపారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు.

News October 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

image

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 8, 2025

చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

image

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>