News October 8, 2025
మెదడు సమస్య కాళ్లలో మొదలు: డాక్టర్

‘మెదడు మోకాళ్లలో ఉందా?’ అని అందరం అనే ఉంటాం కదా. కానీ డిమెన్షియా మోకాళ్లలో మొదలవుతుందని న్యూరో సర్జన్ డా. అరుణ్ L నాయక్ తెలిపారు. పలు శారీరక, మానసిక సమస్యలు కలిసిన వ్యాధి డిమెన్షియా అని ఆయన వివరించారు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కాలి కండరాల్లో పటుత్వం పోయి మెదడుకు పంపాల్సిన కొన్ని కెమికల్స్‌ను నరాలు పంప్ చేయలేవు. ఫలితంగా బ్రెయిన్ ఆలోచన శక్తి తగ్గడం, మతిమరుపు తదితరాలు డిమెన్షియాకు దారితీస్తాయట.
Similar News
News October 8, 2025
నవోదయ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో సీట్ల భర్తీకి అప్లికేషన్ గడువును మరోసారి పొడిగించారు. మొదట సెప్టెంబర్ 23తో దరఖాస్తు గడువు ముగియగా దానిని అక్టోబర్ 7 వరకు పెంచారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని JNV అధికారులు తెలిపారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు.
News October 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 8, 2025
చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>