News October 8, 2025
GNT: అట్లతద్ది..ఆ జ్ఞాపకాలు గుర్తున్నాయా.!

హిందూ సాంప్రదాయాల్లో అట్లతద్దికి ఎంతో విశిష్టత ఉంది. అచ్చు తెలుగు అమ్మాయిల పండుగ ఇది. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈ పండుగతో చాలా మందికి అనేక జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. తెల్లవారు జామునే స్నానం చేసి అరిటాకులో భోజనం చేయడం, దోసెలు తినడం ఆ తర్వాత వీధిలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఊగుతూ కేరింతలు కొట్టడం ఈ పండుగ ప్రత్యేకతలు. చిన్నప్పుడు మీకూ ఈ అనుభవాలు ఉన్నాయా..? కామెంట్ చేయండి.
Similar News
News March 19, 2026
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: మంత్రి పొన్నం

రాష్ట్ర ప్రజలకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆశయాలు నెరవేరి సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
News March 19, 2026
సిద్దిపేట: సిద్ధారెడ్డి పాత్ర మరువలేనిది: హరీశ్ రావు

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి దంపతులను మాజీ మంత్రి హరీశ్ రావు ఘనంగా సన్మానించారు. ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం రావడం తెలంగాణకు దక్కిన గౌరవమని ఆయన కొనియాడారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని, ఆయన ప్రతిభకు ఈ అవార్డు నిదర్శనమని హరీశ్ రావు, దేశపతి శ్రీనివాస్ గుర్తుచేసుకున్నారు.
News March 19, 2026
పాలమూరు: పొలంలో గంజాయి సాగు.. కేసు నమోదు

NGKL జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామ శివారు పరిసర ప్రాంతాల్లో ఓ వ్యవసాయ పొలంలో అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ కృష్ణ తెలిపారు. నేనావత్ తిరుపతయ్య దంపతులు వ్యవసాయ పొలంలో పెంచుతున్న సాగు గురించి సమాచారం అందడంతో పొలంలో సాగు చేస్తున్న 16 గంజాయి మొక్కలను,1.8కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం జరుగుతుందని తెలిపారు.


