News October 8, 2025
కమిన్స్, హెడ్‌కు రూ.58 కోట్ల ఆఫర్!

ఆసీస్ క్రికెటర్లు కమిన్స్, హెడ్‌కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. AUSను వీడి తమ ఫ్రాంచైజీ తరఫున గ్లోబల్ T20 టోర్నీల్లో ఆడితే ఏడాదికి రూ.58.2 కోట్ల చొప్పున ఇవ్వజూపినట్లు వెల్లడించాయి. దీనికి ప్లేయర్లు అంగీకరించలేదని తెలిపాయి. కాగా AUS జట్టు ఏడాదికి ఈ ప్లేయర్లకు చెరో రూ.8.74 కోట్లు చెల్లిస్తోంది. దీనికి దాదాపు 7 రెట్లు IPL ఫ్రాంచైజీ ఆఫర్ చేయడం గమనార్హం.
Similar News
News March 21, 2026
రోహిత్‌ను MI పూర్తిగా వాడుకోవాలి: ఇర్ఫాన్

స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించారు. ‘రోహిత్‌ను MI ఎలా యూజ్ చేసుకుంటుందనేది కీలకం. ఇంపాక్ట్ ప్లేయర్‌లా కాకుండా అతడు గ్రౌండ్‌లో ఉండటం చాలా ముఖ్యం. కెప్టెన్‌కు సాయపడగలడు. విజయవంతమైన సారథిని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకోవాలి’ అని సూచించారు. గత IPLలో రోహిత్ భారీగా పరుగులు చేశారని, ఈసారి ఇంకా మెరుగ్గా ఆడతారని అన్నారు.
News March 21, 2026
TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం TDP మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి(81) కన్నుమూశారు. అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయన ఉమ్మడి అనంతపురం జిల్లా TDP అధ్యక్షుడిగా 10 ఏళ్లు పనిచేశారు. పంచాయతీ వార్డు సభ్యుడి స్థాయి నుంచి 2014లో ఎమ్మెల్యేగా ఎదిగారు. అటు ఉమ్మడి ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పని చేశారు. ఈయన మృతిపట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
News March 21, 2026
‘ధురంధర్ 2’ సంచలనం.. ₹331 కోట్ల కలెక్షన్లు!

ధురంధర్ 2 మూవీ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రిలీజైన 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹331 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో ₹267 కోట్లు, ఓవర్సీస్‌లో ₹64 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. ఇండియాలో ప్రివ్యూస్‌తో ₹51కోట్లు, తొలిరోజు ₹121 కోట్లు, రెండోరోజు ₹96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని చెప్పింది. వీకెండ్ కావడంతో మరో 2 రోజుల్లో మూవీ ₹500 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉంది.


