News October 8, 2025
20 ఏళ్ల కోసం నిర్మించి కూల్చేద్దామనుకున్నారు!

పారిస్‌లోని ఐఫిల్ టవర్‌ను 20 ఏళ్ల కోసమే 1889లో నిర్మించారనే విషయం మీకు తెలుసా? ఫ్రెంచ్ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు దీనిని నిర్మించారు. అందమైన పారిస్‌లో ఈ టవర్ అసహ్యకరంగా కనిపిస్తుందని అక్కడి ప్రముఖుల నుంచి విమర్శలూ వచ్చాయి. కానీ రేడియో టెలిగ్రాఫీ ఆవిష్కరణకు టవర్ ఉపయోగపడింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనికున్న యాంటెన్నాలు జర్మన్ సైన్యం కదలికలపై కీలక సమాచారం అందించాయి.
Similar News
News October 8, 2025
మద్యం దుకాణాల దరఖాస్తులకు స్పందన కరవు!

TG: మద్యం దుకాణాల దరఖాస్తుల విషయంలో ఎక్సైజ్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని 2,620 రిటైల్ మద్యం దుకాణాలకు 2 వారాల్లో 2 వేల దరఖాస్తులే వచ్చాయి. 2023లో మొత్తం 98,900 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2,600 కోట్లు సమకూరాయి. ఈ ఏడాది దరఖాస్తు రుసుము రూ.3 లక్షలకు పెంచడం, OCT 12 వరకు మంచి రోజులు లేకపోవడమే తక్కువ స్పందనకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. OCT 18తో దరఖాస్తుకు గడువు ముగియనుంది.
News October 8, 2025
‘దీపావళి’ వెలుగులు నింపాలి.. విషాదం కాదు!

దీపావళి అనగానే ‘బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. కార్మికులు సజీవ దహనం’ అనే వార్తలు వింటూ ఉంటాం. తాజాగా AP కోనసీమ జిల్లాలోనూ అలాంటి ప్రమాదమే జరిగి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తరచూ బాణసంచా తయారీ కేంద్రాలు, దుకాణాలను తనిఖీ చేయాలి. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి. కార్మికులకు జీవిత బీమా చేయించాలి. ఈ పండుగ కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపకుండా చూసుకోవాలి.
News October 8, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 2 రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. రేపు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇవాళ NTR, GNT, బాపట్ల, అనంత, సత్యసాయి తదితర జిల్లాల్లో వర్షం పడింది.