News October 8, 2025

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపన పట్ల ఆసక్తి ఉన్న ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన 16వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమల స్థాపన అనుమతులను పరిశీలించి వెంటనే మంజూరు చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే PMEGP కింద 59 యూనిట్లను మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 7, 2026

భీకర దాడి.. 47 మంది మృతి

image

ఇరాన్‌తోపాటు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇవాళ ష్ముస్టార్, నబీ చిట్ పట్టణాలపై చేసిన ఎయిర్‌స్టైక్స్‌లో 47 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని తెలిపింది. మరో 40 మంది గాయపడినట్లు పేర్కొంది. కాగా 2023 OCT నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 4వేల మందికి పైగా మరణించగా, దాదాపు 17వేల మంది గాయపడినట్లు సమాచారం.

News March 7, 2026

‘కొండ మీది కోతి’నీ తెచ్చి ఇస్తారేమో!

image

ఎన్నికల హామీలు చూస్తుంటే త్వరలో ఎవరో ఒకరు కొండ మీది కోతినీ తెచ్చిస్తామంటారని జోకులు పేలుతున్నాయి. ఇవాళ <<19323424>>TVK విజయ్<<>> కురిపించిన హామీలతో ఈ ప్రస్తావన తెరపైకి వచ్చింది. సాధ్యమేనా? అని కాకుండా గెలుపే లక్ష్యంగా ఇస్తున్న హామీల భారం ట్యాక్సుల రూపేనా ప్రజలపైనే పడుతుందని రాజకీయవేత్తలు అంటున్నారు. ఉచితాలతో రాష్ట్రాల ప్రగతి మందగిస్తుందని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పిన మాటలూ గుర్తుచేస్తున్నారు.

News March 7, 2026

‘మీ పని చూసుకోండి’.. ట్రంప్‌పై కమల్ హాసన్ ఫైర్

image

రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్‌కు అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ సార్వభౌమ దేశమని.. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకోదంటూ ట్రంప్‌ను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. మీ పని మీరు చూసుకోండంటూ ఘాటుగా స్పందించారు. దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి పునాది అని హితవు పలికారు.