News April 7, 2024

కరెంట్ కట్‌కు పుల్‌స్టాప్

image

ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన విద్యుత్ బిల్లు బకాయిల సమస్యకు పుల్‌స్టాప్ పడనుంది. 2015 నుంచి ఉన్న బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు TSSPDCL CMD ముషారఫ్ ఫరూఖీతో చర్చించినట్లు ఆయన ట్వీట్ చేశారు. విద్యుత్ శాఖకు HCA రూ.1.67 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News October 9, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 పడిపోయి రూ.1,00,000కి చేరింది.

News October 9, 2024

WTC: రికార్డు సృష్టించిన రూట్

image

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) చరిత్రలో 5వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ (5005) రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించారు. 59 మ్యాచుల్లో అతను ఈ ఫీట్‌ను అందుకోగా, అతని తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు లబుషేన్(3904), స్మిత్(3,484) ఉన్నారు.

News October 9, 2024

RBI MPC: FY25లో రియల్ జీడీపీ గ్రోత్‌ 7.2%

image

FY25లో భారత రియల్ జీడీపీ గ్రోత్‌ను 7.2 శాతంగా RBI అంచనా వేసింది. Q1లో 8 కోర్ ఇండస్ట్రీస్ ఔట్‌పుట్ 1.8% తగ్గినట్టు తెలిపింది. కరెంటు, కోల్, సిమెంట్ ఉత్పత్తిపై అధిక వర్షపాతం ప్రభావం చూపినట్టు పేర్కొంది. ఇన్‌ఫ్లేషన్ గుర్రాన్ని కట్టడి చేశామని, కళ్లెం విప్పేముందు జాగ్రత్తగా ఉండాలంది. FY25లో ఇన్‌ఫ్లేషన్ 4.5% ఉంటుందని చెప్పింది. ఎమర్జింగ్ కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా ఉన్నట్టు వెల్లడించింది.