News October 8, 2025
వంటింటి చిట్కాలు

* పసుపు, కారం, కరివేపాకు పొడిలాంటివి నిల్వ చేసేటప్పుడు చిటికెడు ఇంగువ కలిపి పేపరు కవర్లలో భద్రపరిస్తే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి.
* బ్రెడ్ ప్యాకెట్లో బంగాళాదుంప ముక్కలు ఉంచితే ఆ బ్రెడ్ తొందరగా పాడవదు.
* ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి కట్ చేసినపుడు చేతులకు వాటి వాసన పోదు. అప్పుడు చేతిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని కొంచెంసేపు శుభ్రంగా రుద్దికడిగితే వాసన పోతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>
Similar News
News March 4, 2026
బిహార్ సీఎంగా బీజేపీ నేత?

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. CM నితీశ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో JDU ఉన్నట్లు సమాచారం. ఆయనకు BJP కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించనుందని తెలుస్తోంది. బిహార్ CMగా బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 89, జేడీయూ 85 సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.
News March 4, 2026
అరుదైన రికార్డుకు వికెట్ దూరంలో బుమ్రా

రేపు T20 WCలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచులో బుమ్రా ఒక్క వికెట్ తీస్తే ఓవరాల్‌గా 500 వికెట్ల క్లబ్‌లో చేరనున్నారు. దీంతో ఈ రికార్డ్ సృష్టించిన 8వ భారత బౌలర్‌గా నిలుస్తారు. ఇప్పటివరకు Tests 234, ODIs 149, T20 116 వికెట్లు పడగొట్టారు. భారత బౌలర్లలో కుంబ్లే(956) అత్యధిక వికెట్ టేకర్ కాగా తర్వాతి స్థానాల్లో అశ్విన్(765), హర్భజన్(717), కపిల్(687), జడేజా(634), జహీర్ ఖాన్(610), శ్రీనాథ్(551) ఉన్నారు.
News March 4, 2026
యుద్ధం.. 1,097 మంది ఇరానియన్లు మృతి

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 1,097 మంది పౌరులు చనిపోయినట్లు USకు చెందిన హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. వీరిలో 10 ఏళ్లలోపు పిల్లలు 181 మంది ఉన్నట్లు తెలిపింది. లెక్కలోకి రాని మృతులు, గాయపడిన వారి సంఖ్య కూడా వందల్లో ఉంటుందని పేర్కొంది. కాగా ఇరాన్‌లోని కీలక స్థావరాలపై US అటాక్ చేస్తుండగా, ఇజ్రాయెల్‌తోపాటు ఇరాక్, కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల దాడి కొనసాగిస్తోంది.


