News October 8, 2025

సిరిసిల్ల: సన్నవడ్ల BONUSపై ఆశలు గల్లంతేనా..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్న వడ్లకు బోనస్ వస్తుందనే ఆశలు ఆవిరవుతున్నాయని పలువురు రైతన్నలు పేర్కొన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతన్నలు సన్న వడ్లను సాగు చేశారు. గత సీజన్లో ప్రభుత్వం 10 వేల క్వింటాళ్లకుపైగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు బోనస్ రాకపోవడంతో రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కూడా సన్నాలను సాగు చేశారు.

Similar News

News March 21, 2026

వనపర్తి: కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు ప్రారంభం

image

కేంద్రీయ విద్యాలయాల్లో (KV) 2026-27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి, బాలవాటిక ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ దశరథ రామ్ తెలిపారు. ఆసక్తిగల వారు https://admission.kvs.gov.in/screen/home ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, 2 నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News March 21, 2026

వేసవిలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదు: డీఆర్ఎం

image

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని వాల్తేరు డివిజన్ వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. విశాఖ సహా ప్రధాన స్టేషన్లలో జనరల్ కోచ్ ప్రయాణికులకు ఉచిత తాగునీరు అందించేలా ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. స్టేషన్లలో రద్దీ నియంత్రణ, భద్రతపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థల సహకారంతో నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News March 21, 2026

IPL-2026కి భారత బౌలర్ దూరం!

image

IPL-2026కి KKR ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌ దీప్ గాయం కారణంగా దూరమైనట్లు CricBuzz పేర్కొంది. ఆయన టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఫ్రాంచైజీ అధికారి ఒకరు తమతో చెప్పారని వెల్లడించింది. కాగా గత ఏడాది జరిగిన మినీ వేలంలో KKR ఆయన్ను రూ.కోటికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేసర్ హర్షిత్ రానా దూరమవ్వగా పతిరణ ఆడటంపైనా అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా బౌలింగ్ లైనప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.