News October 8, 2025
టాటా గ్రూప్ వివాదాలకు త్వరలో తెర!

టాటా గ్రూపులో తలెత్తిన వివాదాలకు త్వరలోనే తెరపడనుందని సమాచారం. గ్రూపులోని టాటా, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు రాజీకి వస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. టాటా సన్స్‌లోనూ డైరెక్టర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. వీటన్నింటిపై అమిత్ షా, నిర్మల సమక్షంలో చర్చలు జరిగాయి. తీవ్ర ప్రభావం చూపించేలా మారిన విభేదాల్ని వీడాలని వారు స్పష్టంచేశారు. రతన్ టాటా మృతి తర్వాత గ్రూపులో విభేదాలు తలెత్తినట్లు చెబుతున్నారు.
Similar News
News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.
News October 8, 2025
SBI డౌన్.. UPI సేవలకు అంతరాయం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) UPI సేవల్లో అంతరాయం ఏర్పడింది. ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామంటూ కస్టమర్లు SMలో రిపోర్ట్ చేస్తున్నారు. దీనిపై SBI స్పందించింది. టెక్నికల్ సమస్య వల్ల UPI సేవలు డిక్లైన్ అవుతున్నాయంది. అంతరాయానికి చింతిస్తున్నామని, 8PM లోగా సరిచేస్తామని స్టేట్‌మెంట్ విడుదల చేసింది. అయితే ఆ సమయం దాటినా ఇంకా సమస్య పరిష్కారం కాలేదని కస్టమర్లు వాపోతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురైందా?
News October 8, 2025
రాజకీయాలు పక్కనబెట్టండి: మంత్రి పొన్నం

TG: BCలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘దీనిపై కోర్టులో బలంగా వాదనలు వినిపించాం. సామాజిక న్యాయం అమలు దృష్ట్యా ప్రతిపక్షాలు రాజకీయాలు పక్కనబెట్టి ఐక్యంగా ఉండాలి’ అని కోరారు. మరో మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గదు. అది రాష్ట్రమైనా రిజర్వేషన్లు అయినా. హామీ నెరవేర్చడం మా పార్టీ స్టాండ్’ అని చెప్పారు.