News October 8, 2025

SRCL: దినసరి కూలీ అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పదంగా ఓ దినసరి కూలీ మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కూడెల్లి పరశురాములు(35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం ఎప్పటిలాగే ఓ ఇంటి నిర్మాణపనికి వెళ్లాడు. అకస్మాత్తుగా కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

Similar News

News March 20, 2026

KMR: నెలవంక దర్శనం.. రేపే ఈద్-ఉల్-ఫితర్

image

ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా నెల రోజులుగా ముస్లింలు పాటిస్తున్న కఠిన ఉపవాస దీక్షలు నేటితో ముగిశాయి.

News March 20, 2026

సిరిసిల్ల: 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది

image

యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు,రైస్ మిల్లర్లు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ నెల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు.

News March 20, 2026

రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

image

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.