News October 8, 2025
తపాలా బిళ్లల సేకరణ ఓ మంచి అలవాటు: DFO

పోస్టల్ స్టాంపుల సేకరణ గొప్ప అలవాటని జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు అన్నారు. బుధవారం కాకినాడ సూర్య కళా మందిరంలో జిల్లా తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిలాటలిక్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివ నాగరాజు, రామకృష్ణ తదితర పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. వివిధ రకాల స్టాంపులు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
Similar News
News October 8, 2025
స.హ చట్టంతో పాలనలో కీలక మార్పులు: కలెక్టర్

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం సమాచార హక్కు చట్టం-2005లో అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సమాచార హక్కు చట్టం- 2005 అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు.
News October 8, 2025
మెదక్: పోటాపోటీగా అండర్-17 బాలబాలికల పోటీలు

పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-17 బాల, బాలికలకు కబడ్డీ పోటీలు బుధవారం జరిగాయి. 210 మంది బాలికలు, 210 మంది బాలురు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ఎంపికైన మెదక్ జిల్లా జట్టు ఇదే నెల 10న సంగారెడ్డిలో జరగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా పోటీలలో పాల్గొంటారన్నారు. రాష్ట్ర పీఈటీల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు.
News October 8, 2025
అమ్మ సంబరాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించాం: EO

పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయవంతంగా ముగిసిందని ఆలయ సహాయ కమిషనర్ కె.శిరీష బుధవారం తెలిపారు. సిరిమానోత్సవం సాఫీగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి కృషిచేసిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, భక్తులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి సిరిమాను సంబరాన్ని సంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించామన్నారు.