News October 8, 2025
నోబెల్.. ఆరేళ్లుగా ఎదురు చూపులే!

మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో గొప్ప ఆవిష్కరణలకు గానూ ఈ ఏడాది కూడా పలువురిని <<17948685>>నోబెల్ బహుమతులు<<>> వరించాయి. కానీ వారిలో ఒక్కరూ భారతీయులు, భారత సంతతి శాస్త్రవేత్తలు లేకపోవడం సగటు భారతీయుడిని నిరాశకు గురి చేస్తోంది. 2019లో చివరిసారి భారత మూలాలున్న అభిజిత్ బెనర్జీకి ఎకానమిక్స్‌లో నోబెల్ వచ్చింది. దేశంలో ఆవిష్కరణలకు కొదువ లేకున్నా నోబెల్ స్థాయికి అవి వెళ్లలేకపోతుండటం ఆలోచించాల్సిన విషయం.
Similar News
News October 8, 2025
విద్యా సంస్థల సమ్మె వాయిదా

TG: ఈనెల 13 నుంచి సమ్మెకు దిగుతామన్న ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కాస్త వెనక్కి తగ్గింది. CMతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇవ్వడంతో సమాఖ్య ప్రతినిధులు సమ్మెను వాయిదా వేశారు. దీపావళిలోగా రూ.300 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. దీంతో OCT 13 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మె, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని OCT 23కు వాయిదా వేయాలని నిర్ణయించారు.
News October 8, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ ఉదయంతో పోల్చితే సాయంత్రానికి భారీగా పెరిగాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,150 పెరగ్గా ఇప్పుడు మరో రూ.760 ఎగిసి రూ.1,23,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ఉదయం రూ.1,050 ఎగబాకగా సాయంత్రానికి మరో రూ.700 పెరిగి రూ.1,13,600 పలుకుతోంది. అటు KG వెండి ధర మార్నింగ్ రూ.100 తగ్గగా ఇప్పుడు రూ.3000 పెరిగి రూ.1,70,000కి చేరుకుంది.
News October 8, 2025
యాక్టింగ్ PMలా అమిత్ షా తీరు: మమత

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై WB CM మమత ఫైరయ్యారు. ఆయనో యాక్టింగ్ PMలా మారారని దుయ్యబట్టారు. ‘షాను ఎక్కువగా నమ్మొద్దని PMకి చెప్పాలనుకుంటున్నా. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను మోసగించి రాజైన మిర్ జాఫర్ లాంటి వ్యక్తి షా. విచిత్రమేమంటే ఆయన గురించి ఈ విషయాలు మోదీకి కూడా తెలుసు’ అని మమత వ్యాఖ్యానించారు. అమిత్ షా కోరిక మేరకే CEC SIR పేరిట ఓటర్ లిస్టుల సవరణ నిర్వహిస్తోందని విమర్శించారు.