News October 8, 2025

మక్తల్: భార్యను హతమార్చిన భర్త అరెస్ట్

image

మక్తల్ మండలం<<17905844>> సత్యారాం<<>> గ్రామంలో ఈనెల 3న జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. భార్య వినోదను భర్త కృష్ణారెడ్డి హతమార్చినట్లు గుర్తించారు. వినోద తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణారెడ్డి ప్లాన్ ప్రకారం హైదరాబాద్ డిమార్టులో కత్తిని కొనుగోలు చేశాడు. దాన్ని స్కూటీలో పెట్టుకొని గ్రామానికి వెళ్లిన అతడు భార్యతో గొడవ పడి హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News October 8, 2025

NRPT: ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజనను సద్వినియోగం చేసుకోవాలి’

image

పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకానికి జిల్లా ఎంపికైందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేది అన్నారు. బుధవారం డిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం, నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కార్యక్రమ లక్ష్యమన్నారు.

News October 8, 2025

108 ఉద్యోగులకు ఉచిత సేవలపై అవగాహన

image

నారాయణపేట జిల్లాలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో 108, 102(అమ్మఒడి) అంబులెన్స్‌లలో పనిచేసే పైలట్‌లు, ఎమర్జెన్సీ టెక్నీషియన్లకు ఉచిత సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలను వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.

News October 8, 2025

అమరావతి జోనింగ్ రూల్స్ మార్పులపై చర్చ

image

AP: అమరావతి రాజధాని ప్రాంతంలో జోనింగ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. హోటళ్ల పార్కింగ్ నియమావళిలోనూ కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించారు. CM CBN అధ్యక్షతన జరిగిన CRDA సమావేశంలో వీటిపై చర్చించారు. రాజ్‌భవన్ నిర్మాణానికి పాలనానుమతి, HOD టవర్లపై మాట్లాడారు. రాజధాని వెలుపల అభివృద్ధి పనులకు భూ లభ్యతతో పాటు హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు ఫీజుల మినహాయింపు, STPల ఏర్పాటు అంశాలు చర్చకు వచ్చాయి.