News October 8, 2025

నరేంద్రపురం గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా మలేరియా అధికారి

image

పి గన్నవరం మండలంలోని నరేంద్రపురం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కోనసీమ జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్రావు బుధవారం సందర్శించారు. గురుకుల పాఠశాల, కళాశాలల వద్ద బాలుర వసతి గృహాల వద్ద దోమల వ్యాప్తి ఉండకుండా నివారణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు.

Similar News

News March 12, 2026

ఈరోజు నమాజ్ వేళలు (12-3-2026) గురువారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.15 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.24 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 12, 2026

నెల రోజుల్లోగా స్మార్ట్ కిచెన్ పనులు పూర్తి చేస్తాం: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 33 స్మార్ట్ కిచెన్ల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేస్తామని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సీఎం చంద్రబాబుకు వివరించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని జిల్లాలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.

News March 12, 2026

తిరుపతి: టెండర్ల నిబంధనలపై కమిషన్ విచారణ

image

కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ దినేశ్ కుమార్ బుధవారం టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగంతో చర్చించారు. జీఎం ఉమాశంకర్ సహా మరికొందరి ఉద్యోగులతో గతంలో టెండర్ల నిబంధనలు.. ప్రస్తుత ధరలు, నిబంధనలు మార్పు చేయాలంటే ఏలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా మరికొన్ని విభాగాల ఆధికారులతో సైతం చర్చించే అవకాశం ఉంది.