News October 8, 2025
NZB: డిప్లొమా పరీక్షల ఫలితాలు విడుదల

నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాలలో జూన్ నెలలో జరిగిన సర్టిఫికేట్ డిప్లొమా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ రాజు తెలిపారు. వివిధ విభాగాల్లో 93 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 68 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పత్రాలతో రుసుము చెల్లించి జనవరిలో జరిగే పరీక్షలకు హజరు కావాలని సూచించారు.
Similar News
News October 8, 2025
ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు: NZB CP

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు నిజమాబాద్ CP సాయి చైతన్య తెలిపారు. బుధవారం కమిషనరేట్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 11 వరకు ప్రక్రియ పూర్తి కానుందన్నారు.
News October 8, 2025
NZB: బ్యాంకర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి

ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, ప్రగతి, వచ్చే సీజన్‌లో రైతాంగానికి అందిచాలన్నారు.
News October 8, 2025
నిజామాబాద్: నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GOను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, జిల్లాలో మొత్తం కలిపి 31 ZPTCలు, 307 MPTC స్థానాలున్నాయి. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా?, లేదా వ్యతిరేకంగా వస్తుందా? COMMENT చేయండి.