News October 8, 2025
ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్

ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్ జోలెపాళ్యం మంగమ్మ 1925 సెప్టెంబర్12న మదనపల్లెలో జన్మించారు. ఈమె MA,BEd, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 1960లో AIRలో చేరి న్యూస్‌రీడర్‌గా, ఎడిటర్‌గా పనిచేశారు. కేంద్రసమాచారశాఖ, విదేశాంగశాఖల్లో కీలక పదవులు చేపట్టారు. ఈమెకు ENG, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీభాషల్లో ప్రావీణ్యం ఉంది.<<-se>>#firstwomen<<>>
Similar News
News October 8, 2025
దగ్గు సిరప్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

దగ్గు సిరప్‌తో MP, రాజస్థాన్‌లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్‌లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
News October 8, 2025
పాకిస్థాన్ ఘోర ఓటమి

WWCలో భాగంగా AUSతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత AUS 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్(35) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించారు. WWCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో చివర నిలిచింది.
News October 8, 2025
‘జోహో’కు జయహో అంటున్న కేంద్రం

PM మోదీ ‘స్వదేశీ’ పిలుపు ‘<<17874488>>ZOHO<<>>’ మెయిల్, ‘ARATTAI’ మెసేజింగ్ యాప్‌కు కలిసొచ్చింది. శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ సంస్థలకు కొన్నేళ్లుగా రాని గుర్తింపు కొద్దిరోజుల్లోనే సొంతమైంది. ఇటీవల కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ZOHO’కు మారగా ఇవాళ హోంమంత్రి అమిత్‌షా జోహో మెయిల్ (amitshah.bjp@ http://zohomail.in) క్రియేట్ చేసుకున్నారు. స్వయంగా కేంద్రమే ఫ్రీ పబ్లిసిటీ చేస్తుండటంతో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.