News October 8, 2025

NSPT: పారా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ పారా మెడికల్ కళాశాలలో రెండు కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈసీజీ డిప్లొమాలో 30 సీట్లు, డిప్లొమా డయాలసిస్‌లో 30 సీట్లు ఉన్నట్లు చెప్పారు. ఈ నెల 28 వరకు నర్సంపేట మెడికల్ కాలేజీలో దరఖాస్తులను చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Similar News

News April 2, 2026

వరంగల్: ప్రాణదాతలు.. ఈఎంటీలు!

image

అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలబెడుతున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అమోఘం. ఉమ్మడి వరంగల్‌లో 109 మంది ఈఎంటీలు గడిచిన ఏడాదిలో 1,17,054 మందిని కాపాడారు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను సమయస్ఫూర్తితో MGMకు తరలించిన కర్ణాకర్ వంటి వారు ఎందరో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు ‘జాతీయ ఈఎంటీ దినోత్సవం’.

News April 2, 2026

వరంగల్: అంగన్‌వాడీ పోస్టులు ఎప్పుడు..?

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 919 కేంద్రాలు ఉండగా.. 66 టీచర్, 284 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్న టీచర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పౌష్ఠికాహారం, సర్వేలు సక్రమంగా జరగడం లేదు.

News April 2, 2026

గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.