News October 8, 2025

అష్టాంగ నమస్కారం అంటే ఏంటి? ఎలా చేయాలి?

image

8 అంగములతో చేసేదాన్ని అష్టాంగ నమస్కారం అంటారు. దీన్నే సాష్టాంగ నమస్కారం అని కూడా పిలుస్తారు. ఇందులో ఉపయోగించే 8 అంగాలు ఇవే..
1. ఉరసా(తొడలు), 2. శిరసా(తల)
3. దృష్ట్యా(కళ్లు), 4. మనసా(హృదయం)
5. వచసా(నోరు), 6. పద్భ్యాం(పాదాలు)
7. కరాభ్యాం(చేతులు), 8. కర్ణాభ్యాం(చెవులు) అని అర్థం.
<<-se>>#Sankhya<<>>

Similar News

News March 20, 2026

సన్నబియ్యం పంపిణీకి రూ.7,366 కోట్లు: భట్టి

image

TG: రాష్ట్రంలో 3.38 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు బడ్జెట్లో ₹7,366CR కేటాయించినట్లు Dy CM భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనివల్ల 1.05 కోట్ల తెల్లరేషన్ కార్డు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అలాగే 4.50L ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ₹7,430CR ప్రతిపాదించామని బడ్జెట్ ప్రసంగంలో వివరించారు.

News March 20, 2026

ధాన్యం సేకరణ కోసం రూ.22,700 కోట్లు

image

TG: యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ప్రభుత్వం నిధులను సిద్ధం చేసింది. దీని కోసం రూ.22,700 కోట్లను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.

News March 20, 2026

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. నోటిఫై చేసిన కేంద్రం

image

FY 2026-27 APR 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ను కేంద్రం నోటిఫై చేసింది. ఇందులో భాగంగా HYD, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌ నగరాలను మెట్రో జాబితాలో చేర్చి HRA మినహాయింపును 50%కి పెంచడం విశేషం. దీని ద్వారా రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్‌పరెన్సీ పెంచేలా క్యాపిటల్ గెయిన్స్, NRI పన్ను నిబంధనలను కూడా ప్రభుత్వం కఠినతరం చేసింది.