News October 8, 2025
₹1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ₹1.14లక్షల కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంటు ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపింది. ఐటీ, ఇంధన, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులు ఏర్పాటుకానున్నాయి. రేడియంట్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ సంస్థ ₹87,520కోట్ల పెట్టుబడి పెడుతోందని, గతంలో ఈస్థాయిలో రాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఇన్వెస్టుమెంట్స్‌ను రప్పించిన లోకేశ్‌ను సమావేశంలో మంత్రులు అభినందించారు.
Similar News
News March 23, 2026
భారీగా తగ్గిన క్రూడాయిల్ ధరలు!

ఇరాన్‌పై దాడులను 5 రోజులు నిలిపేస్తున్నామన్న ట్రంప్ <<19457337>>ప్రకటనతో<<>> క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఉదయం బ్యారెల్ 110 డాలర్లపైనే ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర తాజాగా 13% పడిపోయింది. 17 డాలర్ల నష్టంతో 96 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావం INDలోని పెట్రోలియం ఉత్పత్తులపై చూపే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన పవర్ పెట్రోల్ ధర దిగివచ్చే ఛాన్స్ ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో US మార్కెట్లు భారీ లాభాల్లోకి వెళ్లాయి.
News March 23, 2026
ట్రంప్ భయపడ్డారా?

ఇరాన్‌తో యుద్ధానికి 5 రోజులు బ్రేక్ వేశామన్న ట్రంప్ ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ఆయన భయంతోనే సడన్‌గా ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం వల్ల USకు రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. హార్ముజ్‌ను ఇరాన్ క్లోజ్ చేయడంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే తమకు మరింత నష్టమని భావించే ట్రంప్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
News March 23, 2026
హైకోర్టులో 300 పోస్టులకు నోటిఫికేషన్

AP: రాష్ట్ర హైకోర్టులో 300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెక్షన్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 19వ తేదీ దాకా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.20,000-1,47,760. విద్యార్హతలు, ఇతర వివరాలకు వెబ్‌సైట్: <


