News October 8, 2025

HYD: డీజీపీని కలసిన సర్పంచుల సంఘం సభ్యులు

image

నూతన డీజీపీ శివధర్ రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం బుధవారం కలిసింది. రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, డీజీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని వాపోయారు. సర్పంచుల బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, చట్టపరంగా పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరారు.

Similar News

News March 14, 2026

RR: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులు శుక్రవారం వాటిని ఖాళీ చేసి, సొంతూళ్లకు పయనమయ్యారు. రేపటి నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఫస్టియర్‌లో 84,301 మంది, సెకండియర్‌లో 70,171 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 200 పరీక్ష కేంద్రాల్లో 96 శాతం మంది హజరయ్యారు.

News March 14, 2026

ఖమ్మం: ఎస్సీ సబ్సిడీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపుల పంపిణీలో గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన ఎస్సీ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 14, 2026

యాదాద్రి: సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

జిల్లాలో 2027 జనగణన తొలి దశ హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెంసస్‌కు సంబంధించిన జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉండటంతో ఈ నెల 16న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. దరఖాస్తులు ఇవ్వడానికి ఆ రోజు కలెక్టరేట్‌కు రావద్దని ప్రజలకు సూచించారు. జనగణన పనుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.