News October 8, 2025
ములుగు: ట్రైబల్ వర్సిటీకి డిసెంబర్‌లో శంకుస్థాపన..!

సమ్మక్క, సారక్క జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముందడుగు పడింది. నిన్న యూనివర్సిటీ లోగోను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భవన నిర్మాణాల ముహూర్తంపై సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్‌లో ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం రూ.880 కోట్లు కేటాయించింది. ఇటీవలే రూ.25కోట్లతో ప్రహరీ పనులు ప్రారంభమయ్యాయి.
Similar News
News March 4, 2026
తిరుపతిలో 20 ఏళ్ల CM కల.. తీరేనా?

రుయాతోపాటు TTD పరిధిలోని స్విమ్స్, బర్డ్ ఆసుపత్రులను ఓకే గొడుగు కిందకు తేవడం CM చంద్రబాబు ఆలోచన. దీంతో యాత్రికులు, స్థానికులకు మెరుగైన వైద్యం అందిచవచ్చు. 20 ఏళ్లుగా ఈ ప్రతిపాదన ముందుకు కదలడం లేదు. TTD మాజీ EO అనిల్ ఇందుకు వ్యతిరేకత చూపినట్లు సమాచారం. రుయా సర్వీస్ రూల్స్, TTD సర్వీస్ రూల్స్ వేరు కావడం, సాంకేతిక, పాలన పరమైన అంశాలను ప్రధాన కారణంగా చెబుతున్నారు. మరోసారి CM దీనిని తెరపైకి తెచ్చారు.
News March 4, 2026
గుండ్ల సింగారం కెనాల్‌లో లభ్యమైన మృతదేహం

ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి గల్లంతైన భీమారం వాసి సాంబయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం గుండ్లసింగారం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆయన కొట్టుకుపోయారు. కేయూసీ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, పలువేల్పుల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
News March 4, 2026
మురికివాడలో టూరిజం.. 2 గం.కు రూ.15,000!

ముంబైలోని ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ‘ధారవి’ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వింతగా అనిపించినా.. ఇక్కడి జీవనశైలిని, కుటీర పరిశ్రమలను చూపించేందుకు గైడ్లు ఒక్కో వ్యక్తి నుంచి 2 గంటలకు రూ.15,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విదేశీయులు ఈ ‘స్లమ్ టూరిజం’పై ఆసక్తి చూపుతున్నారట. పేదరికాన్ని కూడా ఒక వ్యాపారంగా మార్చడంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.


