News October 8, 2025

చియా సీడ్స్ ఎలా తీసుకోవాలంటే?

image

చియా సీడ్స్ చూడడానికి చిన్నగా ఉన్నా, పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. వీటిని నీటిలో లేదా పాలల్లో కొన్నిగంటలు నానబెట్టి స్మూతీస్, చియా పుడ్డింగ్‌లో కలుపుకోవచ్చు. సలాడ్స్, సూప్స్‌పై చల్లుకొని తీసుకోవచ్చు. బేక్ చేసిన పదార్థాలలో కూడా వీటిని కలపొచ్చు. షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారు, లేదా ఏవైనా మందులు వాడుతున్నవారు చియా సీడ్స్‌ను తమ ఆహారంలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

Similar News

News October 8, 2025

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును AICC ప్రకటించింది. ఇన్నిరోజులు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా అవకాశం మాత్రం నవీన్‌ను వరించింది. BRS పార్టీ ఇప్పటికే దివంగత MLA మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ, MIMలు పోటీ నుంచి తప్పుకున్నాయి. BJP టికెట్ ఎవరికి ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News October 8, 2025

పాక్ PMని ‘పెట్’తో పోల్చిన హర్ష్ గోయెంకా

image

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సెటైరికల్‌గా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రధాని మోదీ పుంగనూరు ఆవును, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు కుక్కలను పట్టుకున్న ఫొటోను ఆయన Xలో షేర్ చేశారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కన మాత్రం పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఉన్నారు. దీనికి ‘గ్లోబల్ లీడర్లు అందరికీ వారి వారి ఫేవరెట్ పెట్స్ ఉన్నాయి’ అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు.

News October 8, 2025

దగ్గు సిరప్‌‌పై కేంద్రం కీలక ఆదేశాలు

image

దగ్గు సిరప్‌తో MP, రాజస్థాన్‌లో 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో నలుగురు మరణించడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. రా మెటీరియల్స్‌‌, ఫైనల్ ప్రొడక్ట్స్‌ అన్నీ క్షుణ్నంగా టెస్ట్ చేయాలంది. 4 ఏళ్లలోపు పిల్లలకు కోల్డ్, కాఫ్ సిరప్‌లు ఇవ్వొద్దని చెప్పినా విక్రయాలు జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.