News April 7, 2024
హైదరాబాద్: UPDATE: గన్‌తో కాల్చుకొని AR SI సూసైడ్?
ఓల్డ్ సిటీలోని కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్‌తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 25, 2024
HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ రెడ్డి
తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరును శివ చరణ్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నియామక పత్రం అందజేశారు.
News December 25, 2024
శంషాబాద్‌లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెదక్ జిల్లాలోని తునికిలోని ఐసీఏఆర్ విజ్ఞాన కేంద్రానికి షెడ్యూల్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న సుమారు 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు.
News December 25, 2024
HYD: సంపులో నాగు పాము (PHOTO)
సంపులో నాగు పాము ప్రత్యక్ష్యమైంది. స్థానికుల వివరాలు.. హైదర్‌షాకోట్ బైరాగిగూడలోని ఓ ఇంట్లో పాము దూరింది. ఒక్కసారిగా సంపులో పడిపోయింది. పైకి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ పడగ విప్పి బుసలు కొట్టింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, స్థానికులు వెంటనే స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచాక్యంగా పామును పట్టుకొని, అక్కడి నుంచి తరలించారు.