News October 8, 2025
విజయవాడ: RTC పైసా వసూల్..!

దసరా సందర్భంగా విజయవాడ PNBSకు SEP 24 నుంచి OCT 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.20.20 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 40 లక్షల మంది పండుగ రోజుల్లో రవాణా చేశారు. PNBS పరిధిలో మొత్తం 750 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక గత ఏడాది కేవలం 20 లక్షల మందే ట్రావెల్ చేయగా.. రూ.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఉచిత బస్సు పథకం వల్ల 50% ప్రయాణికులు సంఖ్య, 25% ఆదాయం పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 14, 2026
HNK: పల్లె సీమలు.. అభివృద్ధి వైపు అడుగులు..!

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 208 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ నిధులను వర్షపు నీటి నిల్వ, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ పనులకు మాత్రమే ఉపయోగిస్తారు. 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలకు సంబంధించిన స్థానిక అభివృద్ధి పనులకు రోడ్లు, డ్రైనేజీ ఈ నిధులను వినియోగించనున్నారు. .గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక (GPDP) రూపొందించి, గ్రామ సభ ఆమోదంతో ఈ పనులు చేపడతారు.
News March 14, 2026
ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో నెం.1గా నిలపాలి: కలెక్టర్

రహదారి ప్రమాదాలను తగ్గించి, ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
News March 14, 2026
వనపర్తిలో టెన్త్ పరీక్షలకు 7,212 మంది విద్యార్థులు

వనపర్తి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల్లో (25 ప్రభుత్వ, 12 ప్రైవేట్) మొత్తం 7,212 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్ణీత సమయానికి అరగంట ముందే చేరుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.


