News October 8, 2025

మాకవరపాలెం: జగన్ పర్యటన.. భద్రతపై ఎస్పీ సమీక్ష

image

మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంతాన్ని ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు. రేపు జరగనున్న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంభందించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే ప్రదేశంతో పాటు కళశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 9, 2025

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌గా సమంతపూడి

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సమంతపుడి వెంకట సత్యనారాయణ రాజును నియమించారు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కీటకాలజీ విభాగ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బుధవారం సమంతపూడి వెంకట సత్యనారాయణ రాజును కొత్త వైస్‌ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

News October 9, 2025

10న వెంకటాచలం రానున్న CM..

image

CM చంద్రబాబు ఈ నెల 10న వెంకటాచలం మండలంలో పర్యటించనున్నారు. ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల ఏర్పాట్లను పరిశీలించారు. సర్వేపల్లి బిట్ 2 గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం, నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల, విశ్వసముద్ర బయో ఇథనాల్ ప్లాంట్ పరిసరాలను వారు ముమ్మరంగా తనిఖీ చేశారు.

News October 9, 2025

ఖమ్మం: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

image

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ఈ సమావేశంలో పాల్గొన్నారు.