News October 8, 2025
అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లాలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్, గర్ల్ చైల్డ్ డే, చెత్త సేకరణ, తల్లికి వందనం, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
Similar News
News March 19, 2026
గ్యాస్, క్రూడ్ డేటా ఇవ్వండి.. ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను తమకు ఇవ్వాలని ఆదేశించింది. దీని ఆధారంగా సప్లై చెయిన్‌ను మరింత సమర్థంగా పర్యవేక్షించడమే లక్ష్యమని పేర్కొంది.
News March 19, 2026
ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.
News March 19, 2026
అమలాపురం: కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలకు నాంది పలుకుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి మమ్మీ పేర్కొన్నారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులను అధికారులు అధికారికంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


