News October 8, 2025
బాణాసంచా విక్రయాల అనుమతికి దరఖాస్తు చేసుకోండి: వరంగల్ సీపీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణాసంచా విక్రయాలు, నిల్వ కోసం అనుమతి కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఆసక్తి ఉన్నవారు సూచించిన పత్రాలతో కలిపి ఈ నెల 16వ తేదీలోపు సంబంధిత డీసీపీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు.
Similar News
News March 28, 2026
ప్రజలకు అందుబాటులోకి భద్రగిరి మార్ట్..!

స్థానికుల ప్రయోజనార్థం ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ కృషితో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ట్రైబల్ మ్యూజియం వంటి వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు పొందిన పీవో రాహుల్ భద్రగిరి మార్ట్ అందుబాటులోకి తేవడంతో మరో మైలురాయిగా నిలిచింది. గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం కోసం మార్ట్ ఏర్పాటు చేశారు.
News March 28, 2026
GWL: క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు 30న ఎంపిక: కృష్ణయ్య

తెలంగాణ క్రీడా పాఠశాలల్లో 2026-27 సంవత్సరంలో 4వ తరగతిలో చేరే విద్యార్థులకు ఈ నెల 30న గద్వాల ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అధికారి కృష్ణయ్య శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://tgss.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 26 నుంచి మార్చి 12 వరకు నమోదు చేసుకుని ఎంపికకు హాజరు కావాలన్నారు. వివరాలకు 9885479896 ను సంప్రదించాలన్నారు.
News March 28, 2026
తేనెటీగల పెంపకంతో ఆర్థికాభివృద్ధి: ఐటీడీఏ పీవో

తేనెటీగల పెంపకం ద్వారా యువత స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని ITDA PO బి.రాహుల్ పిలుపునిచ్చారు. స్థానిక YTCలో 5 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలతో తేనె సేకరణ, ఆన్‌లైన్ మార్కెటింగ్ చేపట్టి అదనపు ఆదాయం పొందాలని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు, హనీ బీ బాక్సులను పంపిణీ చేశారు.


