News October 8, 2025
సిద్దిపేట: ‘అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దు’

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. కావున పోలీసుల అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టవద్దని, తప్పనిసరి అయితే పోలీస్ అనుమతి తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 22, 2026
మూలపేట పోర్ట్ సకాలంలో పూర్తయ్యేనా ?

టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ పనులు జాప్యంపై వైసీపీ పార్టీ సందర్శనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ ఎప్పటికీ పూర్తయ్యేను? అన్న చర్చ సాగుతుంది. 2023 ఏప్రిల్ 19న రూ.2,949.70 కోట్ల అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 17న డెడ్ లైన్ నిర్ణయించారు. మళ్లీ 2026 నవంబరుకి పెంచారు. గడువులోగా పూర్తయ్యేనా అన్నది ప్రధాన చర్చ…!
News March 22, 2026
ఏలూరు జిల్లాలో క్షీణిస్తున్న భూగర్భ జలాలు

ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. జిల్లాలోని 394 గ్రామాల్లో ప్రస్తుతం 194 గ్రామాల్లో 8 నుంచి 20 మీటర్లు లోతులోనూ.. 200 గ్రామాల్లో 20 మీటర్లు పైబడి భూగర్భ జలాల స్థాయి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్తు తరాలకు నీటివనరులు సమృద్ధిగా ఉండే విధంగా భూగర్భ జలాలను పెంపొందించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ద్వారకాతిరుమల, కొయ్యలగూడెం మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
News March 22, 2026
ENG కోచ్ మెక్‌కల్లమ్‌పై సంచలన ఆరోపణలు

ENG కోచ్ మెక్‌కల్లమ్ మద్యం, పొగ తాగే ప్లేయర్లకే ప్రయారిటీ ఇస్తారని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. యాషెస్ సిరీస్ మధ్యలో 6 రోజులు ప్లేయర్లు మద్యం తాగినట్లు ఆరోపణలున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్లే టీమ్ ఓడినట్లు కొందరు ఆటగాళ్లు అభిప్రాయపడినట్లు సమాచారం. ECB మీటింగ్‌లో స్టోక్స్, మెక్‌కల్లమ్ ఒకరినొకరు నిందించుకున్నట్లూ వార్తలొస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను మెక్‌కల్లమ్ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.


