News October 8, 2025
VKB: సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: అ.కలెక్టర్

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ ఐదు నుంచి 12 వరకు గ్రామపంచాయతీలో మండల కార్యాలయాల్లో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పౌరుడు అడిగిన సమాచారాన్ని అధికారులు ఇవ్వాలని తెలిపారు.
Similar News
News March 20, 2026
‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.
News March 20, 2026
తక్కెళ్లపాడు: నాగులేరు వాగులో పడి బాలుడు మృతి

వాగులో ప్రమాదవశాత్తూ బాలుడు మునిగి మృతి చెందిన ఘటన దాచేపల్లి మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు..తక్కెళ్లపాడుకు చెందిన రామసైదులు(16) గ్రామానికి సమీపంలోని నాగులేరు వాగు వద్ద ఆడుకుంటూ కాలుజారి పడి ఊపిరాడక ప్రాణాలను వదిలాడు. మృతదేహాన్ని గ్రామస్థులు బయటకు తీయగా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 20, 2026
అకాల వర్షాలు.. రూ.62 కోట్ల నష్టం

AP: అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో మొక్కజొన్న, వరి, మినపకు రూ.40 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 9 జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరపకు, 9 జిల్లాల్లో మామిడి, బత్తాయి, నిమ్మకు రూ.22.68 కోట్ల నష్టం(మొత్తం రూ.62.68 కోట్లు) వాటిల్లినట్లు వెల్లడించారు. రైతులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని CBN ఆదేశించారు.


