News October 8, 2025

పార్టీ మారినా ఎమ్మెల్సీ పద్మశ్రీకి దక్కని ప్రాధాన్యత!

image

కాకినాడ: ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన MLC కర్రి పద్మశ్రీని అవమానాలు వెంటాడుతున్నాయి. అందరూ ఎమ్మెల్సీలను పిలుస్తున్నా.. ఇంతవరకు ఆమెను మాత్రం జడ్పీ సర్వసభ్య సమావేశానికి పిలవలేదట. గతంలో YCPలో ఉన్నప్పుడూ ప్రాధాన్యత దక్కలేదని ఆమె అనుచరులు వాపోతున్నారు. నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీని ఎదగనివ్వలేదంటున్నారు. ఇప్పుడు TDPలో చేరగా MLA కొండబాబు సైతం పద్మశ్రీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.

Similar News

News March 28, 2026

విజయవాడలో యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం..!

image

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి (GGH) సాక్షిగా దారుణం జరిగింది. జగ్గయ్యపేటకు చెందిన ఓ యువతి తన తండ్రి చికిత్స కోసం ఆస్పత్రికి రాగా, అక్కడ పరిచయమైన అమీన్ అనే ఆటో డ్రైవర్ ఆమెను నమ్మించి కృష్ణలంకకు తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు తన తల్లికి విషయం చెప్పడంతో, వారు మాచవరం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 28, 2026

డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి

image

డోర్నకల్-గద్వాల మధ్య 296km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా సాగుతుంది. ఈ లైన్ సింగరేణి బొగ్గు రవాణాకు & తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల కనెక్టివిటీకి, సామాజిక- ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. జడ్చర్ల-నంద్యాల లైన్ ట్రాఫిక్ (182km) తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

News March 28, 2026

నాగార్జునసాగర్ తీరంలో అంతర్జాతీయ సదస్సు!

image

నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని 22 దేశాల బౌద్ధ ప్రతినిధులు శనివారం సందర్శించనున్నారు. బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం వీరు ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని అధికారుల సమాచారం. ఈ సందర్శన బౌద్ధ సాంస్కృతిక పరస్పర మార్పిడి, ప్రచారం, పరిశోధనలకు కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు.