News April 7, 2024

చంద్రబాబు చిప్ బాగా వీక్ అయింది: VSR

image

చంద్రబాబుపై YCP నేత విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘చంద్రబాబు చిప్ బాగా వీక్ అయింది. ప్రచారంలో మళ్లీ హాస్యగుళికలు విసురుతున్నారు. విద్యార్థులకు రిజర్వేషన్లు తెచ్చింది ఆయనేనట! అబ్బాయిలు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి తెచ్చారట! గతంలో తాను బ్రిటిష్ వారిపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చానని బాంబు పేల్చారు. జనం ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఆ కామెడీ ఏంటి బాబు గారూ?’ అని ట్వీట్ చేశారు.

Similar News

News March 1, 2025

మాకు శాశ్వత శాంతి కావాలి: జెలె‌న్‌స్కీ

image

వైట్‌హౌస్‌లో US అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. ‘థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్రెసిడెంట్. ఉక్రెయిన్‌కు శాశ్వత శాంతి కావాలి. మేం అందుకోసమే పనిచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. కాగా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకోవడం లేదని, జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవడం లేదని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.

News March 1, 2025

WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

error: Content is protected !!