News October 8, 2025
RTI ద్వారా పాలనలో బాధ్యత, పారదర్శకత: ఎస్పీ

సూర్యాపేట: సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా పాలనలో మరింత పారదర్శకత, బాధ్యత పెరుగుతుందని ఎస్పీ నరసింహ అన్నారు. ఈ నెల 5 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చట్టం కింద ప్రజలు కోరిన సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.
Similar News
News October 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్
✓ లింక్ క్లిక్ చేసి రూ.1.25 లక్షలు పోగొట్టుకున్న పాల్వంచ యువకుడు
✓ భద్రాచలంలో రూ.10 లక్షల బాణసంచా సీజ్
✓ భద్రాద్రి: మండలాలకు చేరిన బ్యాలెట్ బాక్సులు
✓ నోటికాడి కూడు లాక్కోవద్దని పినపాక పోడు రైతుల ఆవేదన
✓ కొత్తగూడెం: CJIపై దాడి చేసిన వారిని శిక్షించాలి: యూత్ కాంగ్రెస్
✓ములకలపల్లి: పిడుగుపాటుకు ఇల్లు దగ్ధం
News October 9, 2025
భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత: కలెక్టర్

జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన భూగర్భ జల అంచనా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ వంటి చర్యల ద్వారా నీటిమట్టం మెరుగుపడిందన్నారు. భూగర్భ జల ఉపసంహరణ నిబంధనలు–2023ను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
News October 9, 2025
కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CBN

AP: కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై YCP రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.