News October 8, 2025

నవోదయ ప్రవేశాల గడువు మళ్లీ పెంపు

image

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో సీట్ల భర్తీకి అప్లికేషన్ గడువును మరోసారి పొడిగించారు. మొదట సెప్టెంబర్​ 23తో దరఖాస్తు గడువు ముగియగా దానిని అక్టోబర్​ 7 వరకు పెంచారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్టోబర్​ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని JNV అధికారులు తెలిపారు. లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నారు.

Similar News

News October 9, 2025

తెలుగు టైటాన్స్ ‘తగ్గేదేలే’.. వరుసగా ఐదో విజయం

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12లో తెలుగు టైటాన్స్ అదరగొడుతోంది. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు హరియాణా స్టీలర్స్‌తో మ్యాచులో 46-29 తేడాతో విక్టరీ సాధించింది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో 8 గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో భరత్ 20, విజయ్ మాలిక్ 8 పాయింట్లు సాధించారు. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ, పుణెరి పల్టాన్ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.

News October 9, 2025

గుర్తుంచుకోండి.. మీ కర్మలకు మీరే బాధ్యులు!

image

ఒకప్పుడు దొంగగా ఉన్న బోయవాడు ‘నా పాపంలో భాగం పంచుకుంటారా’ అని కుటుంబసభ్యులను అడిగితే.. వాళ్లు ‘వద్దు’ అని తేల్చి చెప్పారు. ఆ మాటకు జ్ఞానోదయం పొందిన ఆ బోయవాడు నారదుడు ఉపదేశించిన మంత్రాన్ని పఠించి, పాప విముక్తుడై వాల్మీకిగా మారి, రామాయణాన్ని రచించాడు. లోకం కూడా అంతే! ఎప్పుడూ తన లాభాలనే చూస్తుంది. మన కర్మలకు మనమే బాధ్యులమవుతాం. ఈ సత్యాన్ని తెలుసుకొని మంచి మార్గంలో పయనిస్తేనే ఆయనలా మహర్షులం అవుతాం.

News October 9, 2025

కల్తీ లిక్కరంటూ ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు: CBN

image

AP: కల్తీ మద్యం అంటూ ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని CM CBN ఆదేశించారు. ‘అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్‌ ఘటనపై YCP రాజకీయ లబ్ధికోసం రాష్ట్రమంతా దుష్ప్రచారం చేస్తోంది. ప్రాణాలు పోతున్నాయని ప్రజల్ని భయపెడుతోంది. మంత్రులు వీటిని ఖండించాలి’ అని చెప్పారు. వివేకా హత్యలో ఆడిన డ్రామాలను మరిచిపోవద్దన్నారు. ఫేక్ ప్రచారంతో ఆ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తోందని విమర్శించారు.