News October 8, 2025
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: నోడల్ అధికారి

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా సహకార, ఎన్నికల వ్యయ నోడల్ అధికారి గంగాధర్ అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌సీ భవనంలో బుధవారం జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్రమ నగదు, బంగారం, ఉచితాల పంపిణీని అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా పాటించాలని ఆయన కోరారు.
Similar News
News October 9, 2025
ఖమ్మం: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
News October 9, 2025
ఖమ్మం: ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ: అ.కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని అ.కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. టీఎన్జీఓస్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈసారి 3.69 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, గన్నీ సంచులు, లైటింగ్, నీటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
News October 8, 2025
మధిరలో కౌంటింగ్ సెంటర్ పర్యవేక్షించిన కలెక్టర్

మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల ఎంపీటీసీ–జడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రిక్రియేషన్ క్లబ్‌లో ప్రిసైడింగ్ అధికారుల శిక్షణలో పాల్గొని సూచనలు ఇచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు.