News October 8, 2025
కాకరేపుతోన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు

ప్రస్తుత రాజకీయాలు ఉమ్మడి జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ములకలచెరువులో దొరికిన అక్రమ మద్యం, పరివట్టం వివాదం, దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన అంశాలు జిల్లాలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, విపక్షాల మాటలతో జిల్లాలో రాజకీయాలు కాకరేపాయి. చంద్రబాబు, పెద్దిరెడ్డి వంటి కీలకనేతలు ప్రాతినిధ్యం వహించడం, ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి.
Similar News
News March 25, 2026
జీవీఎంసీలో పెరగనున్న కార్పొరేషన్ వార్డుల సంఖ్య

ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా వార్డుల సంఖ్య సవరణకు నిర్ణయం తీసుకుంది. 15 లక్షలకు పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లలో గరిష్ఠంగా 120 వార్డులు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుతం జీవీఎంసీలో 98 వార్డులు ఉండగా, జనాభా దాదాపు 24 లక్షలకుపైగా చేరింది. దీంతో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, జీవీఎంసీలో విలీనం చేయాల్సిన గ్రామాల అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.
News March 25, 2026
మచిలీపట్నం RTA ఆఫీస్‌పై ఏసీబీ దాడులు

మచిలీపట్నంలో రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో అక్రమాలపై అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
News March 25, 2026
అత్యంత కాలుష్య పట్టణం మన దేశంలోనే..

ప్రపంచంలో అత్యంత కాలుష్య పట్టణంగా లోనీ(UP) నిలిచింది. స్విస్ సంస్థ IQఎయిర్ విడుదల చేసిన గ్లోబల్ ర్యాంకింగ్స్-2025లో ఈ విషయం వెల్లడైంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో న్యూఢిల్లీ టాప్‌లో ఉంది. అదే సమయంలో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా పాకిస్థాన్ నిలిచింది. ఈ లిస్టులో ఇండియా 6వ ప్లేస్‌లో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో కేవలం 14% నగరాలు మాత్రమే WHO ఎయిర్ క్వాలిటీ ప్రమాణాన్ని అందుకున్నాయి.


