News October 8, 2025
HYD: గవర్నర్‌కు మల్లారెడ్డి ఆహ్వానం

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఈనెల అక్టోబర్ 15వ తేదీన మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ డిజిటల్ క్యాంపస్ 3.0 సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
Similar News
News October 9, 2025
VKB: రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్‌కు అందించాలి: అ. కలెక్టర్

రైస్ మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సకాలంలో సీఎంఎస్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా రైస్ మిల్లర్లు బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. సకాలంలో బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.
News October 9, 2025
టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
News October 9, 2025
SVU నూతన VCగాడాక్టర్ నరసింగరావు

తిరుపతి SVUకు నూతన వైస్ ఛాన్స్‌లర్ (VC)ను నియమిస్తూ బుధవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాదులో అడ్వైజర్, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ టాటా నరసింగరావు VCగా నియమితులయ్యారు. ఈయన మూడేళ్లు పదవిలో కొనసాగనున్నారు.