News October 8, 2025

అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన భద్రాద్రి కలెక్టర్

image

కొత్తగూడెంలో ప్రకాష్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యా కార్యక్రమాల అమలు విధానాలను సమీక్షించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి, పిల్లలకు సమయానికి ఆహారం, పాలు, గుడ్లు అందజేయాలని ఆదేశించారు.

Similar News

News October 9, 2025

టపాసుల గోదాములపై తనిఖీలు చేపట్టండి: కలెక్టర్

image

రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో టపాసుల తయారీ కేంద్రాలు, గోదాములను వెంటనే తనిఖీ చేసి 48 గంటల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని అగ్నిమాపకశాఖ అధికారులను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలు, గోదాముల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం లైసెన్సు పొందినవారే బాణసంచా తయారీ, నిల్వలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

News October 9, 2025

SVU నూతన VCగాడాక్టర్ నరసింగరావు

image

తిరుపతి SVUకు నూతన వైస్ ఛాన్స్‌లర్ (VC)ను నియమిస్తూ బుధవారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాదులో అడ్వైజర్, ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ టాటా నరసింగరావు VCగా నియమితులయ్యారు. ఈయన మూడేళ్లు పదవిలో కొనసాగనున్నారు.

News October 9, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.